ఈ నెల వనితామాలికలో …… వర్షాకాలంలో అందం, ఆరోగ్యం భర్తలు భార్యలని ఇలానే ఊహిస్తుంటారా? మహా మేధావి జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుందామా? పిల్లలు ఏడుస్తుంటే ఏం చెయ్యాలి? రోం లో రోమన్ లా ఉండాలా? పుష్కర ప్రాభవం – గంగ తూర్పున వేడి వేడి గా కారం కారం గా, పశ్చిమంలో చల్ల చల్లగా తియ్య తియ్యగా, వనితామాలిక మీకోసం. చదవండి …… చదివించండి …… వనితామాలిక. రచయిత/త్రులకు మనవి ; మీరు వనితామాలికకు [...]
గంగ – భగీరధుడి పట్టుదలతో భువికి దిగివచ్చిన గంగ శివుడి జటాజూటంలో చేరి ఆయనకి నిత్యాభిషేకం చేసే గంగ ఎటువంటి పాపాన్నయినా పటాపంచలు చెయ్యగలదనే నమ్మిక గల గంగ జీవనదిగా గలగలమని పారుతూ కడలిలో కలిసేవరకు భూమికి పచ్చదనాన్ని, చల్లదనాన్ని పంచే గంగ గంగ పేరు మదిలో మెదలగానే మనసు ఉప్పొంగుతుంది, ఒక ఆధ్యాత్మిక భావన చుట్టుముడుతుంది. ఆ మన గంగమ్మకి ఈ సంవత్సరం పుష్కర ప్రాముఖ్యం కూడా తోడయింది. గంగా పుష్కరం కోసం ఒక రెండు [...]
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి.. పారిపోనీకుండా పట్టుకో నా చేయి.. అని ఊరడించాలి కాని ఏడుస్తూ ఉంటే పట్టించుకోకపోడం మనవల్ల అవుతుందా? పిల్లలు ఏడుస్తూ ఉంటే, మన పెద్దవాళ్ళు కాసేపు అలాగే ఏడవనీయమంటారు. ఏడుపు బలమని, జీర్ణశక్తి పెరుగుతుందని, …. “బాలానాం రోదనం బలమని” రకరకాలుగా చెబుతారు). కొంతమందేమో ఏడ్చిన వెంటనే ఎత్తుకుంటే పిల్లలు గారాబం నేర్చుకుంటారని, ఎప్పుడూ ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటారనీ భావించి కాసేపు ఏడవనిస్తారు. కానీ పిల్లల మానసిక నిపుణుల ప్రకారం, పిల్లలు ఏడవగానే [...]